Nagarjuna Venkatesh Dances at Naga Chaitanya Weddingటాలీవుడ్ సెలబ్రిటీల నుండి దిగ్గజ రాజకీయ ప్రముఖుల వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు ఎన్నో ప్రతిష్టాత్మక వివాహాలు జరిగాయి. కాస్ట్లీ కార్పెట్స్ తో మొదలై… గ్రాండ్ ఇంటిరియర్ డెకరేషన్ వరకు అన్ని హంగులు కూడుకుని, వందల రకాల భోజనాల వరకు కొన్ని కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు పెట్టిన వివాహాలకు కొదవలేదు. కానీ ఆ పెళ్ళిళ్ళల్లో లేనటువంటి ‘స్వచ్చమైన’ ఆనందం, గోవాలో జరిగిన నాగచైతన్య – సమంత పెళ్లిలో మాత్రం తారసపడడం గమనించదగ్గ విషయం.

ఇందుకు నిదర్శనంగా పెళ్లి రోజు రాత్రి అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, పెళ్ళికొడుకు నాగచైతన్యలు కలిసి వేస్తున్న స్టెప్పులను ‘కింగ్’ నాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వేడుకకు సంబంధించిన ప్రతి ఫోటోలోనూ హృదయపూర్వకమైన ఆనందం వెల్లివిరియడం, బహుశా ఈ పెళ్లికే హైలైట్ కావచ్చు. ఇతర పెళ్ళిళ్ళ మాదిరి గ్రాండ్ డెకరేషన్స్, కాస్ట్లీ కార్పెట్స్, వేలకు వేలు అతిధులు… ఇలా ఎవ్వరూ లేకపోయినా… ఒక్కటి కాబోయే ఇద్దరిలో ఆనందం, చేస్తున్న పెద్దలలో ఎంజాయ్ మూడ్… ఈ పెళ్లిని మరింత స్పెషల్ గా మార్చేశాయి.