nagarjuna praises akhil performanceఅక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన ‘అఖిల్‌’ సినిమాకు రివ్యూవర్లు నెగటివ్‌ రివ్యూలు ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే నాగార్జున మాత్రం తాజాగా జరిగిన ‘అఖిల్‌’ సక్సెస్‌మీట్‌లో తన కొడుకు సినిమాకు 5/5 రేటింగ్‌ ఇచ్చాడు. అఖిల్‌ మొదటి సినిమాతోనే ఈ స్థాయి కలెక్షన్స్‌ను సాధించడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడం తండ్రిగా సంతోషంగా ఉందని నాగార్జున పేర్కొన్నాడు. ‘అఖిల్‌’ విజయానికి ఒక తండ్రిగా పూర్తి సంతోషంగా ఉన్నాను అంటూ నాగార్జున అన్నాడు.

‘అఖిల్‌’ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అక్కినేని ఫ్యాన్స్‌ ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నప్పటికి సాదారణ ప్రేక్షకులు మాత్రం బిలో యావరేజ్‌ అంటూ తేల్చి పారేస్తున్నారు. సినిమాపై హైప్‌ వచ్చిన కారణంగా మొదటి రోజు భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. కాని రెండవ రోజు నుండి ఈ చిత్రం కలెక్షన్స్‌ తగ్గుముఖం పట్టాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం నిర్మాత నితిన్‌, సుధాకర్‌ రెడ్డిలకు తీవ్ర నష్టాలను మిగల్చడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఆ నష్టాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో నాగార్జున ఇలా 5/5 రేటింగ్‌ ఇచ్చాడు. మరి నాగార్జున రేటింగ్‌ను ఎవరైనా పట్టించుకుంటారా అనేది చూడాలి.