nagarjuna open comments on movies and webseries reviewsసాధార‌ణంగా మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా స‌మీక్ష‌ల‌కు ప్రాధాన్యత పెరిగిపోయింది. ఒక‌ప్పుడు రివ్యూల‌నేవి వారానికి ఓసారి మాత్ర‌మే కొన్ని వార ప‌త్రిల్లో వ‌చ్చేవి. అప్ప‌టికే సినిమాకు సంబంధించిన మౌత్ టాక్ జ‌నాల్లోకి వెళ్లిపోయి ఉండేది. కాబ‌ట్టి సినిమా రివ్యూల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. అదీగాక అప్ప‌టి జ‌నాల‌కు సినిమా ఒకటే ఎంట‌ర్‌టైన్మెంట్ మాధ్య‌మం కాబ‌ట్టి సినిమా రివ్యూల‌ను చదివినా సినిమాను చూడాల్సిందే అనేట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కొద‌వే లేదు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్పుడు సామాన్యుడి చేతిలోకి అందుబాటులోకి వ‌చ్చేసింది. దీంతో ఛాయిస్ ప్రేక్ష‌కుడికే చేతికి వెళ్లింది. సినిమా చూడాలా, వ‌ద్దా!అని ప్రేక్ష‌కుడు నిర్ణ‌యించుకునే ప‌రిస్థితి క్రియేట్ అయ్యింది.

అందుకునే ప్రస్తుత ప‌రిస్థితుల్లో సినిమా రిలీజ్ కాగానే ప్రేక్ష‌కుడు దృష్టి సినిమా రివ్యూ ఎలా ఉంది! అని ఎదురు చూస్తున్నాడు. సోష‌ల్ మీడియాలో సినిమాకు ఎలాంటి టాక్ వ‌స్తుందని చూసుకుని దాన్ని బ‌ట్టి సినిమాను వెంట‌నే చూడాలా, లేదా… అస‌లు చూడాలా వ‌ద్దా! అని నిర్ణ‌యించుకుంటున్నాడు. రివ్యూల‌ను బేస్ చేసుకుని సినిమాల‌ను చూడ‌టం ఏంటి.. అనే వాదన లేక‌పోలేదు. అయితే సినిమా రివ్యూల‌ను చైసి సినిమాలు చూడ‌టం అనేది సామాన్యులే కాదు.. సెల‌బ్రిటీ కూడా చేస్తున్న ప‌ని. ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు.. సాక్షాత్తు స్టార్ హీరో నాగార్జున.

రీసెంట్ ఇంట‌ర్వ్యూలో నాగార్జున రివ్యూల గురించి మాట్లాడుతూ తాను కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌ను చూడాల‌నుకున్న‌ప్పుడు రివ్యూల‌ను చూస్తాన‌ని అన్నారు. ‘ఒక‌ప్పుడు సినిమా రిలీజైన వారం త‌ర్వాతే రివ్యూలు వ‌చ్చేవి. అప్ప‌టికి సినిమా ఉందో లేదో జ‌నాల‌కు పెద్ద‌గా తెలిసేది కాదు. దీంతో రివ్యూల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకునేవారు కాదు. కానీ సామాజిక మాధ్య‌మాల‌కు ప్రాధాన్యం పెరిగిన త‌ర్వాత రివ్యూల‌ను చూసే వారి సంఖ్య పెరిగింది. రివ్యూల‌కు డిమాండ్ పెరిగింది. సినిమా ఎలా ఉంద‌నే టాక్ విష‌యంలో రివ్యూల‌కు ఇంపార్టెన్స్ పెరిగింది. నేను కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలంటే ఐఎండీబీలో రేటింగ్స్ చూస్తాను. కనీసం వెయ్యి రివ్యూలు, ఏడు రేటింగ్ ఉంటే సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ చూస్తాను. లేకుంటే టైమ్ వేస్ట్ క‌దా’ అన్నారు.

సాధార‌ణంగా మ‌న స్టార్స్ మేం రివ్యూల‌ను ప‌ట్టించుకోం. అస‌లు రివ్యూల‌ను ఎవ‌రు ప‌ట్టించుకుంటారు అని అంటుంటారు. కానీ అంద‌రూ రివ్యూల‌ను ఫాలో అవుతుంటార‌ని చెప్ప‌టానికి నాగార్జున చెప్పిన మాట‌లే ఉదాహ‌ర‌ణ‌. పాతికేళ్ల‌కు పైగా అనుభ‌వం ఉన్న న‌టుడు, సీనియ‌ర్ స్టార్ హీరో, స్టూడియో అధినేత‌, నిర్మాత అయిన నాగార్జున వంటి వ్య‌క్తే అలా రివ్యూల‌ను చూస్తాన‌ని బాహాటంగా చెప్ప‌టం గొప్ప విష‌య‌మే. మ‌రి రివ్యూల‌పై ఇప్పుడు ఇత‌ర స్టార్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.