oopiri special show screening karan joharఅగ్ర హీరోలు ఏం చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రిన్స్ మహేష్ బాబు లాంటి హీరో ఒక సైకిల్ మీద వస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ 2015వ సంవత్సరంలో ‘బాహుబలి’ తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించారు. అయితే ఆ సినిమాలో మహేష్ తొక్కిన సైకిల్ హైలైట్ అవ్వడం మరో విశేషం. ఒక సైకిల్ కోసమే చిత్ర యూనిట్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వైనం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

తాజాగా కింగ్ నాగార్జున విషయంలోనూ ఇదే జరుగుతోంది. “ఊపిరి” సినిమాలో నాగ్ కూర్చున్న వీల్ చైర్ విలువ ఎంత ఉందో తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. దాదాపుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా నాగార్జున కొలతలతో ఈ వీల్ చైర్ ను రూపొందించారని చిత్ర ప్రమోషన్ లో భాగంగా తెలిసింది. ‘ది ఇన్ టచబుల్స్’ సినిమాకు తయారుచేసిన చేసిన స్వీడన్ కంపెనీయే తెలుగు “ఊపిరి” సినిమాకు కూడా ఈ వీల్ చైర్ ను తయారుచేసి ఇవ్వడం విశేషం.