Nagarjuna on director v v vinayak‘కింగ్’ నాగార్జున ‘స్టార్’ వారసత్వాన్ని కొనసాగించే హీరో అఖిల్ ఒక్కడే అన్నది స్పష్టమైన అంశం. చైతూ కూడా నాగ్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నప్పటికీ, ‘స్టార్’ క్యాటగిరిలో చైతూకు చోటు దక్కడం దాదాపుగా కష్టమే. కానీ అఖిల్ విషయంలో వేరు. తొలి సినిమాతోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న “అఖిల్”కు రావాల్సిన సక్సెస్ మాత్రం రాలేకపోయింది.

దీంతో అఖిల్ ను తన తనయుడిగా “హలో” చిత్రం ద్వారా మళ్ళీ రీ లాంచ్ చేయబోతున్నట్లు నాగ్ ప్రకటించాడు. అఖిల్ ను తాను ఎలా అయితే చూడాలనుకున్నానో, ఏ విధంగా అయితే ప్రజెంట్ చేయాలనుకున్నానో… అదంతా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కు చెప్పానని, ఆ తర్వాత “హలో” సినిమా అందించారని చెప్పిన నాగ్, ఈ సినిమాతో అఖిల్ మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తాడని అభిమానులను ఉద్దేశించి చెప్పారు.

అంటే… అఖిల్ తొలి చిత్ర దర్శకుడు వినాయక్ విషయంలో నాగ్ తనకున్న అసంతృప్తిని పరోక్షంగా ‘హలో’ ఆడియో వేడుకపై వెలిబుచ్చారనేది సినీ జనాల టాక్. నిజానికి అఖిల్ ను ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో వినాయక్ తో కూడా వివిధ సందర్భాలలో చెప్పే ఉంటారు, అందుకు అనుగుణంగా చర్చలు జరిపే ఉంటారు. కానీ, అక్కడ దొరకని సంతృప్తి ఇక్కడ లభించిందంటే… “రాజు గారి రెండవ భార్య మంచిది” అన్నట్టే కదా..!