Nagarjuna-Demanded-That-He-Should-Be-The-Starకింగ్ నాగార్జున కెరీర్ లో ఎన్ని కమర్షియల్ సక్సెస్ లైనా రావచ్చు గానీ, ఆల్ టైం క్లాసిక్ హిట్స్ లో “మన్మధుడు” మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు ఇప్పటికీ బుల్లితెరపై మంచి క్రేజ్ ఉండగా, తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం అవుతోందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే తమ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ సంస్థలో “మన్మధుడు 2” అనే టైటిల్ ను నాగ్ రిజిస్టర్ చేయించడంతో, ఈ సినిమా ఎవరితో చేస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నానితో మల్టీస్టారర్ చేస్తోన్న నాగ్, ఆ తర్వాత ‘బంగార్రాజు’ సినిమాను చేయనున్నారు. దీంతో నాగ్ కోసం ఈ టైటిల్ కాదన్న విషయం ఖరారయ్యింది.

నాగ్ లేరంటే చైతూ గానీ, అఖిల్ గానీ ఈ సినిమాలో హీరో కావడం తధ్యం. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అఖిల్ హీరోగా ఓ సినిమాకు సంప్రదింపులు జరిగాయన్న వార్తలు రావడంతో, త్రివిక్రమ్ – అఖిల్ కాంబోలో “మన్మధుడు 2” తయారవుతుందేమో అన్న అభిప్రాయం వెలువడుతోంది. ఎవరు నటించినా, ‘మన్మధుడు’ సినిమాలో నాగ్ ను మైమరిపించడం మాత్రం కష్టమైన విషయమే.