Nagarjuna- Manmadhudu 2 ready for releaseఅక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న సినిమా విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 15న ప్రభాస్ ‘సాహో’ సినిమా వస్తుందని తెలిసే ‘మన్మథుడు 2’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏదో తాత్కాలికంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని, దగ్గర చేసి వాయిదా వేస్తారని భావించారు. కానీ అసలు వాయిదా వేసే ఆలోచన ‘మన్మథుడు 2’ టీమ్ కి లేదని తెలుస్తోంది.

‘సాహో’ వస్తుందని తెలిసే డేట్ వేశామని, వెనక్కి తగ్గేదే లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సరే వారు తీసిన సినిమా మీద వారికి నమ్మకం ఉండటం మంచిదే అయితే ప్రొమోషన్ల విషయంలో చిత్ర బృందం టోటల్ గా వెనుకబడిపోయింది. గత నెలలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తరువాత ఇంకేమీ లేదు. సినిమా విడుదలకు ఒక నెల మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ కూడా లేదు. సాహో వంటి కొండను ఢీ కొట్టేటప్పుడు అసలు కనీస పబ్లిసిటీ లేకపోవడం ఏంటో?

గత ఏడాది చిలసౌ వంటి మంచి సినిమాతో డైరెక్టర్ అవతారం ఎత్తిన రాహుల్ ర‌వీంద్ర‌న్‌ ఈ సినిమాకు దర్శకుడు. అక్ష‌ర‌గౌడ‌, ర‌కుల్ ప్రీతి సింగ్, కీర్తి సురేష్ లాంటి భామలు నటిస్తున్నారు. నాగార్జున కోడలు సమంత కూడా చిన్న పాత్ర చేసిందట. 2016లో వచ్చిన ఊపిరి తరువాత నాగార్జునకు సరైన హిట్ లేదు. ఆ సినిమా తరువాత వచ్చిన ఐదు సినిమాలు ప్లాపులుగా మిగిలిపోయాయి. ఈ చిత్రంతో పాత బాకీ తీర్చాలని కసిగా ఉన్నాడు నాగ్. అయితే ఆ కసి పబ్లిసిటీలో చూపిస్తే మంచిది.