nagarjuna-devadas-latest-updatesకింగ్ నాగార్జున – నాచురల్ స్టార్ నానిల మల్టీస్టారర్ “దేవదాస్” సినిమా షూటింగ్ ముగిసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రెండు పాటలు విడుదలై శ్రోతలను అలరిస్తుండగా, తాజాగా షూటింగ్ ను నాగార్జున తీసిన సెల్ఫీతో ముగించారు. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసారు.

సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. వైజయంతీ మూవీస్ పై అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్లుగా ‘బ్లాక్ బస్టర్’ ఫేం రష్మిక మరియు ఆకాంక్షలు కనిపించనున్నారు. ఈ సెల్ఫీ పిక్ లో కనిపిస్తోన్న హుషారును చూస్తుంటే… షూటింగ్ అద్భుతంగా జరిగినట్లుగా స్పష్టమవుతోంది.