Nagarjuna Damarikham movie director Srinivasa Reddy got TTD postతిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్వీబీసీ ఛానల్ బోర్డు డైరెక్టరు పదవికి సినీదర్శకుడు శ్రీనివాసరెడ్డి, యాంకర్ స్వప్నను ప్రభుత్వం నియమించింది. గతంలో చిన్న చిన్న సినిమాలు చేసిన శ్రీనివాసరెడ్డి 2012లో నాగార్జునతో ఢమరుఖం అనే భారీ బడ్జెట్ సినిమా చేశారు. ఆ సినిమా అనేక కారణాల వల్ల చాలా సార్లు వాయిదా పడి విడుదల అయ్యాక బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.

ఆ తరువాత మూడు సంవత్సరాలకు మామ మంచు అల్లుడు కంచు అనే సినిమా చేసినా విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను తెరమీదకు ఎక్కించే పనిలో ఉన్నాడు. ఎన్నికల ముందు ఎంతో మంది సినిమా సెలెబ్రిటీలు వైఎస్సార్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. అయితే శ్రీనివాసరెడ్డి మాత్రం రాలేదు.

మరి ఆయనకు జగన్ కు ఎలా కుదిరిందో తెలీదు. ఇది ఇలా ఉండగా ఈ వార్త రాగానే మొదట అందరు నటుడు శ్రీనివాసరెడ్డి అనుకున్నారు. దీంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నటుడు శ్రీనివాసరెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ ఆ పదవి వచ్చింది తనకు కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాకపోవడంతో అందరిలో గందరగోళం నెలకొంది.

ఎస్వీబీసీ చైర్మన్ గా సినీ నటుడు బాలిరెడ్డి ఫృధ్వీరాజ్‌ను కొన్నాళ్ల క్రితం నియమించిన సంగతి తెలిసిందే. సహజంగా.. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్న ఇద్దర్ని… డైరక్టర్లుగా నియమిస్తూ ఉంటారు. కానీ ఈ సారి బోర్డులో సభ్యులను కాకుండా.. బయట వాళ్లను డైరక్టర్లుగా నియమించడం టీటీడీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.