nagarjuna bangarraju collectionsఈ సంక్రాంతి పండగకు విడుదలైన ఏకైక పెద్ద సినిమాగా “బంగార్రాజు” బాక్సాఫీస్ వద్ద బ్యాటింగ్ ఓ రేంజ్ లో చేస్తోంది. సంక్రాంతి పండగకు కలర్ ఫుల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన “బంగార్రాజు” మొదటి మూడు రోజులకు దాదాపుగా 60 శాతం రెవిన్యూను రాబడతుండడం విశేషం.

పండగ హంగామా ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలలో “బంగార్రాజు” కలెక్షన్స్ అంతే సౌండ్ చేస్తున్నాయి. నాగార్జున – నాగచైతన్యల మాస్ యాక్టింగ్, కృతి శెట్టి క్యూట్ లుక్స్, అనూప్ రూబెన్స్ సాంగ్స్, విలేజ్ వాతావరణం… మొత్తంగా ‘బంగార్రాజు’ను ప్రేక్షకుల దగ్గరికి చేర్చాయి.

‘బంగార్రాజు’ తప్ప, సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాలలో “హీరో” పాస్ మార్క్ లను వేసుకుంది గానీ, ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. “రౌడీ బాయ్స్”లో అనుపమ అధర చుంబనం హైలైట్ గా మారగా, “సూపర్ మచ్చి” పోస్టర్ వైపు కూడా అస్సలు చూడొద్దని విశ్లేషకులు తేల్చేసారు.

‘ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్’ సినిమాలు పోటీ పడాల్సిన సమయంలో చిన్న సినిమాలు విడుదల కావడంతో, ఫోకస్ అంతా ‘బంగార్రాజు’ పైకి వెళ్లడం, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా టాక్ తెచ్చుకోవడంతో, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ తొలి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

అయితే ఏపీలో మరో రెండు రోజుల్లో కరోనా ఆంక్షలు అమలులోకి రానుండడం, వీక్ డేస్ లో ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందనేది వేచిచూడాల్సిన అంశం. దగ్గర్లో మరో పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడం కూడా “బంగార్రాజు” పాలిట అసలు వరం కానుంది.