nagarajuna raghavendra rao movieవైవిధ్యమైన పాత్రలకు ఇటీవల కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాడు ‘కింగ్’ నాగార్జున. ‘మనం’తో మొదలైన ప్రస్థానం మొన్నటి “ఊపిరి” వరకు కూడా విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా మరోసారి భక్తిరస చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు నాగ్.

‘అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీసాయి’ చిత్రాలతో ‘హ్యట్రిక్’ అందుకున్న నాగ్ – రాఘవేంద్రరావు – కీరవాణి కాంభినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు “హతీరామ్ బాబా”గా రాబోతున్నారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా తిరుపతిలో మొదలుపెట్టినట్లు సమాచారం.

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడిగా హతీరామ్ బాబాకు ఉన్న చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోబోతుందని టాక్. ముందుగా ఈ సినిమాకు “నమో వేంకటేశాయ” అనే టైటిల్ ను అనుకున్నప్పటికీ, తాజాగా “హతీరామ్ బాబా”ను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. “సోగ్గాడే చిన్నినాయనా” సినిమాలో ‘బంగార్రాజు’గా ప్లే బాయ్ పాత్ర పోషించి అభిమానులను అలరించిన నాగ్, ఒక్కసారే ‘బంగార్రాజు’ నుండి ‘బాబా’ పాత్రకు మారడం విశేషం.