Nagarjuna Akkineni Wild Dog Netflixథియేటర్లు పునః ప్రారంభమైనప్పటికీ కింగ్ నాగార్జున యొక్క వైల్డ్ డాగ్ ఓటీటీ విడుదలను ఎంచుకున్న మొదటి చిత్రం కావచ్చు. ప్రముఖ ఓటీటీ మేజర్, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క ఆన్‌లైన్ స్ట్రీమింగ్ హక్కులను పొందిందని వార్తలు వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన అమౌంట్ కు చిత్రం టేబుల్ ప్రాఫిట్ గా నిలిచిందట.

ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే వీకెండ్‌లో ప్రదర్శించనున్నట్లు మనకున్న సమాచారం. దీనిపై ఒక వారంలో స్పష్టత రావొచ్చు. ఇలాంటి సందర్భంలో సంక్రాంతికి సినిమా ప్రమోషన్లు ప్రారంభమవుతాయి. మరో వైపు… ఈ వార్త రాగానే టాలీవుడ్ లోని స్టార్ల మీద విమర్శలు వస్తున్నాయి. టాలీవుడ్ ఉన్న క్లిష్టపరిస్థితులలో సాయపడటానికి వారు ఏం చేస్తున్నారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

“పెద్ద హీరోల నుండి నాని వంటి వారు కూడా మొహం చాటేస్తున్నారు. సినిమాలు పూర్తయినా థియేటర్లలో విడుదల చెయ్యడం లేదు. నాలుగైదు నెలలు ఖాళీగా పెట్టుకుంటున్నారు. లేకపోతే ఇలా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. ఇన్నాళ్లు పోషించిన థియేటర్లకు మీరు చేసేది ఇదేనా,” అంటూ థియేటర్ల యజమానులు అంటున్నారు.

“సాయి ధరమ్ తేజ్ చూపించిన తెగువ కూడా పెద్ద హీరోలు చూపించలేకపోతున్నారు. పరిస్థితులు ముందు అనుకున్నంత దారుణంగా అయితే లేవని తేలిపోయింది. పక్క రాష్ట్రంలో విజయ్ ని చూసి మన హీరోలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది,” అని వారు అంటున్నారు. అయితే థియేటర్లతో పాటు తమను నమ్ముకున్న నిర్మాతలకు కూడా తాము బాధ్యులమే అని హీరోలు అంటున్నారట.