Wild Dog _ AkkineniNagarjunaకింగ్ నాగార్జున యొక్క వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2 న సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్. అలాగే చిత్రం రన్ టైం కేవలం 2 గంటల 6 నిమిషాలకు వచ్చిందని దర్శకుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. సహజంగా ఈ జోనర్ సినిమాలకు ఎంత తక్కువ రన్ టైం ఉంటే ప్రేక్షకులను అంత ఆకట్టుకోవచ్చు.

పైగా ఈ చిత్రంలో పాటలు కూడా ఉండవు కావున ప్రేక్షకులను ఆసాంతం సినిమాలో లీనం చెయ్యొచ్చు. ఈ చిత్రం కొన్ని నిజ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. హైదరాబాద్ లో జరిగిన గోకుల్ చాట్ బాంబు బ్లాస్ట్ తరువాత జరిగిన ఎన్కౌంటర్ గురించి ఎన్ఐఏ చేసినా ఒక సీక్రెట్ ఆపరేషన్. బాలీవుడ్ నటి డియా మీర్జా ఈ చిత్రానికి హీరోయిన్.

ఈ మూవీకి స్పెషల్ ఆప్స్ ఫేమ్ సైయామి ఖేర్, బిగ్ బాస్ 3 స్టార్ అలీ రెజా సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఊపిరి రచయిత అహిసర్ సోలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అతను గతంలో 2013 లో ఒక బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాటలు లేని ఈ చిత్రానికి నేపథ్య స్కోర్ సంగీతాన్ని తమన్ సమకూర్చారు.

2016 ఊపిరి తర్వాత నాగార్జునకు హిట్ లేదు. దానితో ఆయన, ఆయన అభిమానులు ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రం ముందుగా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చెయ్యాలి అనుకున్నారు. అయితే చివరి నిముషంలో థియేటర్లు తెర్చుకోవడం, ప్రేక్షకులు ఆసక్తిగా రావడంతో ఆ ఆలోచన విరమించుకుని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.