Nagarjuna Akkineni -skipped ys jagan meetఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు మరియు వ్యాపార సాన్నిహిత్య సంబంధాలు కలిగిన అక్కినేని నాగార్జున నేడు జరగబోతున్న సమావేశానికి గైర్హాజరు కావడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ముందుగా చెప్పిన పేర్లలో నాగార్జున మరియు జూనియర్ ఎన్టీఆర్ లు మాత్రం జగన్ తో భేటీకి దూరంగా ఉన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సంగతి పక్కన పెడితే, జగన్ కు అత్యంత సన్నిహితులు కావడంతో నాగ్ రాక సినీ ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని అంతా భావించారు. కానీ చివరి నిముషంలో నాగ్ రాకపోవడానికి గల కారణాలను ముందుగా ‘సాక్షి’ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది. ఇతర ఛానల్స్ తెలియని సమాచారాన్ని సాక్షినే ఈ విషయంలో ముందుగా అందించింది.

అక్కినేని నాగార్జున సతీమణి అమలకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో, నాగార్జున కూడా హోమ్ ఐసొలేషన్ లో ఉండడం వలన జగన్ తో భేటీకి దూరంగా ఉన్నట్లుగా సాక్షి తెలిపింది. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు గురించి కూడా ప్రస్తావిస్తూ, వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయేమో, ఇంకా స్పష్టత లేనట్లుగా తెలిపారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ రాక అనేది వ్యక్తిగత అంశమే కాక రాజకీయ పరంగా కూడా ముడిపడి ఉంది. దీంతో తారక్ తాడేపల్లి వెళ్లడాన్ని అభిమానులు ఎట్టి పరిస్థితులలోనూ జీర్ణించుకునే పరిస్థితులలో లేరు. కారణాలు ఏమైనా ఈ సమావేశానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండడంపై నందమూరి మరియు టిడిపి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.