Nagarjuna Akkineni Om Namo Venkatesaya Movie Motion Poster సంక్రాంతికి విడుదల కానున్న “ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాల ప్రమోషన్స్ తో డిసెంబర్ మాసమంతా మెగా, నందమూరి అభిమానుల కోలాహలంగా మారింది. ఇప్పటికే ‘ఖైదీ’ టీజర్, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్స్ తో చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే తాజాగా మెగా, నందమూరి అభిమానులతో పాటు ఈ డిసెంబర్ లో తాము కూడా హంగామా చేస్తామని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇప్పటికే అఖిల్ నిశ్చితార్ధ వేడుకతో ఫుల్ జోష్ లో ఉన్న అభిమానులకు ‘కింగ్’ నాగార్జున “ఓం నమో వేంకటేశాయ” టీజర్ ని చూపించడానికి సిద్ధమవుతున్నారు. దీనిని ధృవీకరిస్తూ చిత్ర యూనిట్ తాజాగా ఓ మోషన్ పిక్చర్ ను విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన “ఓం నమో వేంకటేశాయ” టీజర్ ను విడుదల చేయనున్నామని స్పష్టం చేసారు.

‘కింగ్’ నాగార్జునకు ఉన్న డిసెంబర్ సెంటిమెంట్ రీత్యా… ఈ సారి సినిమా కాకపోయినా, కనీసం టీజర్ తో అయినా అభిమానులను అలరించాలని ఈ టీజర్ ను సిద్ధం చేస్తున్నట్లుగా కనపడుతోంది. రాఘవేంద్రరావు – నాగ్ కాంభినేషన్ లో వచ్చిన రెండు భక్తిరస చిత్రాలు ‘అన్నమయ్య, శ్రీరామదాసు’ సూపర్ హిట్ కావడంతో, “ఓంనమో వేంకటేశాయ” పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి శాంపిల్ చూసేందుకు సిద్ధంగా ఉండండి అక్కినేని ఫ్యాన్స్..!