Nagarjuna Akkineni in remake of ajay devgan raid movie మనం సినిమా తరువాత నేను పూర్తిగా మారిపోయానని, ఇక నుండి ఫ్యాన్స్ గర్వపడే సినిమాలు మాత్రమే చేస్తా అని నాగార్జున ప్రకటించారు. ఆ తరువాత సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి వంటి మంచి సినిమాలు తీశారు ఆయన. దీనితో అక్కినేని అభిమానులు ఉబ్బితబ్బిబైపోయారు. అయితే ఆ తరువాత సీన్ మారిపోయింది. 2016 తరువాత హిట్టయిన ఊపిరి తరువాత ఆయన వరుసగా ఆరు ప్లాపులు ఇచ్చారు.

ప్లాపులు రావడం ఒక హీరోకు సహజమే కాకపోతే ఆ ఆరులోని ఆఫీసర్, మన్మథుడు 2 వంటి ఘోరమైన ప్లాపులు వచ్చాయి.ఆ రెండు సినిమాలు ప్లాపులే కాకుండా అవమానకరంగా కూడా ఉన్నాయి. దీనితో నాగార్జున ఆలోచనలో పడ్డారు ఎలాంటి సినిమా తీస్తే హిట్ వస్తుందా అని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ కూడా ఇంకా ఫైనల్ చెయ్యలేదు.

మరోవైపు ఒక రీమేక్ చిత్రం వైపు నాగార్జున చూస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. హిందీ లో విజయవంతమైన రైడ్ సినిమా రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారట. అజయ్ దేవగన్ ఆ సినిమాలో ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపిస్తారు. ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఈ చిత్రం రీమేక్ హక్కులు దక్కించుకున్నారు.

ఆయన నాగార్జునతో చర్చలు జరుపుతున్నారు. నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ 3 పూర్తి చేసే పనిలో ఉన్నారు. అది పూర్తయ్యాక ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు ఎక్కించే అవకాశం ఉంది. ఒకవేళ అదే నిజమైతే బంగార్రాజు చిత్రం ఇప్పట్లో లేదనే అనుకోవాలి. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించేది తెలియాల్సి ఉంది.