Nagarjuna  about ANR Biopicతప్పుడు లేదు..ఎన్ఠీఆర్ కథని బాలయ్య సినిమాగా తెరకెక్కించాలి అని అనుకోవడం నిజంగా అందరూ హర్షించదగ్గ విషయమే. అయితే జీవిత గాధలు సినిమాగా తెరకెక్కితే పెద్దగా కిక్ ఇవ్వవు అన్నది ‘ఎన్ఠీఆర్- కథానాయకుడు’ రిజల్ట్ చెబుతుంది.

ఇదిలా ఉంటే మరో పక్క తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళల్లో ఒకరు ఎన్ఠీఆర్ అయితే మరొకరు అక్కినేని. ఇక ఎన్ఠీఆర్ బయోపిక్ న్యూస్ బయటకు రాగానే అక్కినేని బయోపిక్ ఎప్పుడంటూ వార్తలు బలంగా వినిపించాయి. ఇక దీనిపై నాగ్ ఎటువంటి భరోసా ఇవ్వలేదు కానీ, తీస్తారా లేదా అనే హింట్ విషయంలో మాత్రం సందిగ్ధంలో ఉంచారు మీడియాని.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్ఠీఆర్ రిజల్ట్ తేడా కొట్టడంతో నాగ్ ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు అని చెప్పవచ్చు, ఎందుకంటే అటు ఎన్ఠీఆర్ కి కానీ. ఇటు అక్కినేని విషయంలో కానీ సినిమా జీవితంలో వారికి ఇబ్బందులు లేవు, స్టార్ డమ్ తప్ప. ఆ క్రమంలో ఒక రకంగా మాట్లాడుకుంటే ఎన్ఠీఆర్ సినిమా మాదిరిగానే అక్కినేని కథ కూడా ఉంటుంది.

ఇంకా ఎన్ఠీఆర్ కి చూపించడానికి పొలిటికల్ టచ్ ఉంది, కానీ అక్కినేని ఆ స్కోప్ లేదు. మరి ఏ రకంగా చూసుకున్నా నాగ్ ఎన్ఠీఆర్ బయోపిక్ రిజల్ట్ తర్వాత అక్కినేని బయోపిక్ తెరకెక్కించాల వద్దా అనే దానిపై ఖచ్చితంగా ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడు అని స్పష్టంగా చెప్పవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.