nagarjuna  about ANR Biopic at wild dog success meetలెజెండరీ తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన చివరి శ్వాస వరకు ప్రేక్షకులను అలరిస్తూ పరిపూర్ణ జీవితాన్ని గడిపారు. కాన్సర్ తో బాధ పడుతున్నా సినిమాపై తనకున్న ప్రేమతో చివరి రోజుల్లో కూడా ఆరోగ్యం సహకరించకపోయినా మనం సినిమాలోని తన పాత్ర యొక్క డబ్బింగ్ కూడా కష్టపడి పూర్తి చేశాడు.

డబ్బింగ్ ఆర్టిస్టు తో చెప్పించడానికి కూడా ఒప్పుకోలేదు ఆయన. అంతటి క్రమశిక్షణ కలిగిన నటుడు ఆయన. ఆయన చివరి చిత్రం.. మనం ఆయనకు నివాళిగా అన్నట్టుగా క్లాసిక్ గా ముగిసింది. అలాగే ఆ సినిమాలోని ఏఎన్నార్ పాత్ర కలకలం గుర్తుండిపోతుంది. ఏఎన్నార్యొక్క బయోపిక్‌ను రూపొందించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది.

వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి నాగార్జునను అడిగారు. “నేను ఎప్పుడూ ఏఎన్నార్ బయోపిక్ చేయాలనుకుంటాను. కాని దానిని సరిగ్గా చెయ్యగలనో లేదో అని కొంచెం భయం కూడా ఉంటుంది. మనం సినిమా కూడా అలాగే చేశాను. అయితే అటువంటి భయం ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా చేస్తాము. ఇది తప్పకుండా మనసులో ఉంది” అని నాగార్జున అన్నారు.

ఈ ప్రకటన గురించి అక్కినేని అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ అంతస్తుల్లోకి వెళ్లేందుకు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మొన్న ఆ మధ్య ఎన్టీఆర్ బయోపిక్ తీసిన బాలయ్య చేతులు కాల్చుకున్నారు. నాగార్జున మాత్రం ఆ ప్రయత్నంలో సక్సెస్ కావాలని కోరుకుందాం.