Nagababu tweets Godse A True Desh Bhaktజనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి అనేది అంతుచిక్కని విషయంగా కనిపించే పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఆ పార్టీ వామపక్షాలతో, మాయావతి పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి… ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తనని తాను వామపక్షవాదిగా చెప్పుకునే వారు. ఎన్నికల తరువాత పరిస్థితులు మారిపోయాయి. జనసేనకు కేవలం ఒకే ఒక్క సీటు వచ్చింది.

రాజకీయ మనుగడ కోసం కేంద్రంలో ఉన్న బీజేపీతో జతకట్టారు పవన్ కళ్యాణ్. అప్పటి నుండి జాతీయవాదం, హిందుత్వ వైపు మళ్లారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ సీనియర్ నేత, పవన్ కళ్యాణ్ అన్న గారు నాగబాబు గాంధీని చంపిన గాడ్సే పై పొగడ్తలు కురిపించారు.

ఆయన నిజమైన దేశ భక్తుడు. గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది డిబేటేబుల్ అని, పాపం గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు అంటూ జాలి పడ్డారు. ఏది ఏమైనా గాడ్సే దేశభక్తి ని శంకించలేము అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. బీజేపీలో ఒక వర్గం గాడ్సే దేశభక్తుడు అనే వాదన తరచు చేస్తుంది దానికి అనుగుణంగా నాగబాబు మాట్లాడినట్టుగా కనిపిస్తుంది.

గతంలో చాలా పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి అయితే తమ ఐడియాలజీని మార్చుకోలేదు. సెక్యూలర్ అని చెప్పుకునే టీడీపీ వంటి పార్టీలు బీజేపీతో పొత్తు సమయంలోనూ ఇటువంటి విషయాలకు దూరంగానే ఉండేవి. అయితే జనసేన మాత్రం ఒక స్థాయికి మించి బీజేపీ వాదాన్ని ఒంటికి పూసుకుంటుంది. బీజేపీతో విలీనం అయిపోతారా అనే అనుమానాలు కూడా పలువురిలో వచ్చేలా చేస్తున్నారు. బీజేపీలో జనసేన విలీనం అయ్యే అవకాశం లేకపోతే అంత పూసుకోనక్కర్లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.