Nagababu Plasma donationగత నెలలో మెగా బ్రదర్ నాగబాబు కరోనా పాజిటివ్ గా తేలారు. ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లి ఆ తరువాత కోలుకున్నాడు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. కోలుకున్న ఒక నెల తరువాత, నాగబాబు తన ప్లాస్మాను దానం చేయడానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ఈరోజు సందర్శించారు.

గత నెలలో మాత్రమే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కరోనా నుండి కోలుకున్న రోగుల ప్లాస్మాను పేదలకు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ గొప్ప ప్రయత్నానికి నాగబాబును సోషల్ మీడియా ప్రశంసించింది. కోలుకున్న వారందరూ ప్లాస్మాను దానం చేసి, మరొకరికి లైఫ్‌ సేవర్‌గా మారాలని ఈ సందర్భంగా మెగా బ్రదర్ పిలుపునిచ్చారు.

మరోవైపు కోలుకున్న నాగబాబు తిరిగి షూటింగులలో పాల్గొంటున్నారు. ఆయన జీ తెలుగులో వచ్చే అదిరింది షోలో జడ్జి గా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గిపోతున్నాయి. ఆయన చివరి సారిగా 2018లో విడుదలైన ఏబీసీడీ అనే చిత్రంలో నటించారు.

2019లో నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసిన నాగబాబు మూడవ స్థానంతోనే సరిపెట్టుకున్నారు. అప్పటి నుండి అడపాదడపా జనసేన పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడం తప్ప ఆయన రాజకీయంగా పెద్దగా ఆక్టివ్ గా లేరు. అయితే యూట్యూబ్ వేదికగా అప్పుడప్పుడు వివిధ రాజకీయ అంశాల మీద స్పందిస్తూ ఉంటారు.