nagababu-balakrishna-political-controversyఅసలు మన పని మనం చూసుకోకుండా…ఎందుకు వచ్చిన వివాదాలు? బాలయ్య పవన్ కళ్యాణ్ ని ఎదో అన్నాడు అని..మొన్నటివరకు నోరు మెదపకుండా ఎన్నికల హడావిడి మొదలు కావడంతో పాపం మెగా బ్రదర్ నాగ బాబు పొలిటికల్ గా కాస్త అప్డేట్ అవుదామని అనుకున్నారో…లేక తమ్ముడికి అండగా నిలుద్దాం అన్న భావనా తెలీదు కానీ…పదే పదే బాలయ్య టాపిక్ తెస్తూ బాలయ్య అభిమానులను రెచ్చగొట్టారు..

ఇక నాగ బాబు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అన్న కసితో ఉన్న బాల కృష్ణ అభిమానులు…చెన్నై లో ఒక ప్రోగ్రాం కి విచ్చేసిన నాగబాబుపై తమ ప్రతాపం చూపించారు. కట్ చేస్తే మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా బాలయ్య నినాదాలతో నాగబాబుని ఇబ్బందులకు గురి చెయ్యడంతో అక్కడ మాట్లాడకుండానే నాగబాబు వెళ్లిపోయినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..

అసలు ఇక్కడ నాగబాబు కానీ…వేరే ఇతర హీరోలు కానీ గమనించాల్సిన విషయం ఏంటి అంటే…ఒక స్థాయికి వచ్చాక ఇతర హీరోలను టార్గెట్ చేసి విమర్శలు చేస్తే అనవసరమైన విమర్శలపాలవ్వక తప్పదు అని. ఇప్పటికే గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినందుకు అటు నాగబాబును, మరో పక్క బన్నీ ను ఆడేసుకున్నారు పవన్ ఫాన్స్…ఇప్పుడు అదే పవన్ కోసం నాగబాబు బాలయ్య ఫాన్స్ కి విలన్ అయిపోయాడు…ఇప్పటికైనా సెలెబ్రేటిస్ కాస్త ఆచి తూచి మాట్లాడితే వారికే మంచిది.