అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె అయిన నాగసుశీల భర్త అనుమోలు సత్యభూషణరావు గురువారం ఉదయం ‘కాలం’ చేసారు. నాగార్జునకు సొంత బావ అయిన సత్యభూషణరావుకు గురువారం ఉదయం గుండెపోటు కారణంగా, తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం లభించింది. ఈ విషయం తెలుసుకున్న అక్కినేని వారి సమీప బంధువులు, నాగార్జున సన్నిహితులు మరియు పలువురు సినీ సెలబ్రిటీలు వారి ఇంటికి వచ్చి సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

సత్యభూషణరావు – నాగసుశీల సంతానం అయిన సుశాంత్ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ‘కరెంట్’ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ప్రేక్షకుల ఆదరణ పొందడంలో ఇంకా తన వంతు ప్రయత్నాలు చేస్తున్న సుశాంత్ కు ఈ లోపున పితృవియోగం సంభవించింది. అలాగే ఏఎన్నార్ కు సంబంధించిన వేడుకలపై బాగా ఏమోషనల్ అయిన నాగసుశీల కూడా అక్కినేని అభిమానులకు, సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయ్యారు.

ఈ సందర్భంగా సదరు అనుమోలు సత్యభూషణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.