naga shourya and akash puri eyeing for first day collectionsప్రస్తుతం సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయినా కేవలం మూడు నాలుగు రోజుల వరకే కలెక్షన్స్ వస్తున్నాయి. కొన్ని సినిమాలు మూడో రోజు నుండి డ్రాప్ అవుతున్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. రాను రాను ఓటీటీ డామినేషన్ ఎక్కువైవుతోంది. రిలీజ్ కి ముందే పోస్టర్స్ మీద అలాగే రిలీజ్ తర్వాత టైటిల్స్ కి ముందే ఓటీటీ సంస్థ లోగో వేసేస్తున్నారు. దీంతో థియేటర్స్ లో సినిమా చూసేందుకు జనాల ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే పైరసీ ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉంది. వీటన్నిటిని అధిగమించి ఒక చిన్న సినిమా వారం రోజులు ఆడటం అంటే గగనం అయిపోతుంది.

అందుకే ప్రస్తుతం కుర్ర హీరోలు ఫస్ట్ డే ఓపెనింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వచ్చే వారం నాగ శౌర్య ‘వరుడు కావలెను’ తో పాటు ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ సినిమలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు స్టార్స్ సపోర్ట్ తో ప్రమోషన్ చేసుకుంటున్నాయి. ఇటు నాగ శౌర్య అటు ఆకాష్ ఇద్దరి టార్గెట్ ఒక్కటే. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం. ఎలాగైనా ఫస్ట్ డే మంచి కలెక్షన్ రాబట్టి పరవాలేదు అనిపించుకోవాలని చూస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటూ మొదటి రోజు ఆడియన్స్ ని ఫిల్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు. నిజానికి ఈ ఇద్దరికీ ఓపెనింగ్స్ కష్టమే. ‘ఛలో’ తర్వాత శౌర్య చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆకాష్ కి ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. గతంలో తండ్రి డైరెక్షన్ లో నటించిన సినిమా కూడా ఆడలేదు. మరి ఈ సినిమాలతో అయినా కుర్ర హీరోలు హిట్ ట్రాక్ లోకి వస్తారా ? అనుకున్న ఓపెనింగ్స్ అందుకుంటారా ?