Naga Shaurya - Ritu Varmaయంగ్ హీరో నాగశౌర్య కెరీర్ స్టార్టింగ్ లో మంచి సినిమాలు ఇచ్చాడు. మహిళా ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆయన సినిమాల మీద మంచి అభిప్రాయమే ఉంది. అయితే కొంత కాలంగా నాగశౌర్య ప్లాపులు వరుసగా ఇస్తూ పోతున్నాడు. తాజాగా వచ్చిన అశ్వథామ తో పాటు ఇప్పటివరకూ వరుసగా నాలుగు ప్లాపులు ఇచ్చాడు.

ఇందులో తన సొంత నిర్మాణ సంస్థలో చేసిన రెండు సినిమాలు కూడా ఉండటం విశేషం. అశ్వథామకు తానే కథా రచయితగా అవతారం ఎత్తినా ఉపయోగం లేకుండా పోయింది. ఎన్నో రిస్కీ ఫైట్స్ చేసినా పని అవ్వలేదు. ఈ తరుణంలో హిట్ కొట్టడం కోసం కృతనిశ్చయంతో ఉన్నాడు ఈ యంగ్ హీరో.

లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ,కొత్త సినిమాకు ఈ రోజు ఉదయం కొబ్బరికాయ కొట్టాడు నాగశౌర్య. ఈ సినిమాలో ఆమెకు జంటగా పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వర్మ కనిపిస్తుంది. సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఈ నెల 19 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. చిత్రానికి సంబంధించిన ఇతర నటీ,నట సాంకేతిక వర్గం వివరాలు మరికొద్దిరోజులలో ప్రకటించబోతున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చబోతున్నారు.