వరుస ప్లాపులు అయినా జోరుగా సినిమాలు…

Naga Shaurya Production N0.4నాలుగు వరుస ప్లాపులు వచ్చినా యువ హీరో నాగ శౌర్య మంచి జోరు మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. అతను ఇటీవల సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో తన 20 వ చిత్రం షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేశాడు. ఆ తరువాత, అతను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించిన పేరులేని చిత్రం షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు.

ఇప్పుడు, ఈ నటుడి యొక్క మరొక ప్రాజెక్ట్ ప్రకటించబడింది. అతని కొత్త చిత్రానికి దర్శకుడు అనీష్ కృష్ణ తో చేతులు కలుపుతున్నాడు. అలా ఎలా? అనే హిట్ సినిమా తో ఆరంగేట్రం చేసిన అనీష్ ఆ తరువాత రాజ్ తరుణ్ లవర్ తో ప్లాప్ మూటగట్టుకున్నాడు. ఉల్లాసమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చెప్పాడుతున్న ఈ చిత్రాన్ని ఇరా క్రియేషన్స్ ఆధ్వర్యంలో శౌర్య తల్లి ఉషా ముల్పురి నిర్మించనున్నారు.

మణి శర్మ కుమారుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం ఇవ్వనున్నారు. ఇదివ‌ర‌కు నాగ‌శౌర్య సూప‌ర్ హిట్ ఫిల్మ్ ‘ఛ‌లో’కు ఆయ‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలోని ‘చూసీ చూడంగానే..’ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో మ‌న‌కు తెలుసు. దీనితో ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉండనున్నాయి.

ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొందరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి చేయ‌నున్నారు. ఈ మూడు సినిమాలతో ఎలాగైనా హిట్ల బాట పట్టాలని శౌర్య కృతనిశ్చయంతో ఉన్నాడు.

Follow @mirchi9 for more User Comments
Fact: Jagan Could Not Manage 20% Of ChandrababuDon't MissFact: Jagan Could Not Manage 20% Of ChandrababuHousing for all is one of the Ratnam of YSR Congress's Nava Ratnalu - the...Nandamuri Balakrishna - AR RahmanDon't Miss#WhoIsBalakrishna: Bad Example Of Tollywood Fans!Nandamuri Balakrishna's comment about AR Rahman in an interview opened a big controversy. The actor...Mahesh - Babu - RajamouliDon't MissMahesh Babu's Next With Rajamouli: Based On These Novels?SS Rajamouli is currently busy wrapping up the shooting of his RRR. There were reports...performance Asuran Narappa scenesDon't MissAsuran Vs Narappa - Who Did Better?Ever since the announcement of the Asuran remake was made, there has been widespread debate...Don't MissJagananna Swimming Pools Scheme in APCash-strapped Andhra Pradesh is focusing more on welfare schemes and is ignoring the infrastructure. As...
Mirchi9