Naga-shaurya-stardomఇప్పుడొస్తున్న కొత్త కుర్రాళ్ళు కూడా రెండు,మూడు సినిమాలతోనే స్టార్డం అందుకొని ఇండస్ట్రీలో చెలామణీ అవుతున్నారు. కానీ కొందరు యంగ్ హీరోలు మాత్రం ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అందులో నాగ శౌర్య ఒకడు.

ఈ కుర్ర హీరో కెరీర్ స్టార్ట్ పడేళ్లవుతుంది. ఆరంభంలో అడపాదడపా క్యారెక్టర్స్ చేసినప్పటికీ ఊహలు గుస గుస లాడే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. కానీ తర్వాత మళ్ళీ వరుసగా అపజయాలు అందుకొని కింద పడిపోయాడు.

చాన్నాళ్లుగా ఒక హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న శౌర్య కి ‘ఛలో’ అనే సూపర్ హిట్ తగిలింది. ఇక శౌర్య హిట్ ట్రాక్ ఎక్కేసాడు అనుకొనేలోపే వరుసగా ఫ్లాప్స్ ఇచ్చాడు. నిజానికి ఛలో తర్వాత నర్తనశాల లాంటి సినిమా చేయడం ఇటు కెరీర్ పై అటు మార్కెట్ పై ఎఫెక్ట్ చూపించింది.

ఇటీవలే మీ కెరీర్ లో ఎక్కువ ఫ్లాప్స్ ఉన్నాయి ఇంకా స్ట్రగిలింగ్ పీరియడ్ లోనే ఉండిపోయారు అనే ప్రశ్న మీడియా నుండి శౌర్య కి ఎదురైంది.

దాంతో ఇక్కడితోనే ఆగిపోలేదు కదా.. ఏ హీరోకయిన స్టార్ అవ్వాలంటే ఐదు బ్లాక్ బస్టర్ హిట్స్ పడాలి. నాకు ఒకటి ఉంది. ఇంకా నాలుగు కోసం వెయిటింగ్. అశ్వథామ మేము అనుకున్నంత ఆడలేదు. కానీ నాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. అంటూ తన కెరీర్ ని అనాల్సిస్ చేసుకున్నాడు. మరి స్టార్డం అందుకొని పెద్ద హీరో అనిపించుకోవడానికి నాలుగు బ్లాక్ బస్టర్స్ మాత్రమే సరిపోద్ది అనేది కరెక్టేనా ? ఈ కుర్ర హీరోకే తెలియాలి.