naga-chaitanya trivikram srinivasస్టార్‌ హీరోలు ఎంతో మంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వెనుక సినిమాలు చేసేందుకు క్యూలో నిల్చున్నారు. త్రివిక్రమ్‌ ఓకే అంటే ఏ హీరో అయినా కూడా ఎన్ని డేట్లు అంటే అన్ని, ఎప్పుడు అంటే అప్పుడు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. కాని ఈ మాటల మాంత్రికుడు మాత్రం వరుసగా చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్‌ హీరోగా ‘అఆ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్‌ ఆ తర్వాత కూడా చిన్న చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

‘అఆ’ ప్రారంభం కాక ముందు నితిన్‌తో కాకుండా నాగచైతన్యతో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అప్పటికే నితిన్‌తో త్రివిక్రమ్‌ సినిమా కమిట్‌ అవ్వడంతో చైతూను పక్కకు పెట్టాడు. తాజాగా సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చైతూతో సినిమాను త్రివిక్రమ్‌ పూర్తిగా వదులుకోలేదని, త్వరలోనే ఆ సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం చైతూ ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘మజ్ను’ చిత్రంలో నటిస్తాడు. ఈ రెండు చిత్రాల తర్వాత చైతూతో త్రివిక్రమ్‌ సినిమా చేస్తాడేమో చూడాలి.