naga-chaitanya-samantha-selfie-at-engagement-of-akhil-shriyaప్రేమికులకు చిన్న అవకాశం దొరికితే చాలు… ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అని చెప్పడానికి ఒక ఉదాహరణగా నాగ చైతన్య – సమంతల జోడి నిలుస్తోంది. గత కొంతకాలంగా ఎక్కడోకచోట దర్శనమిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన ఈ జంట, తాజాగా అఖిల్ – శ్రియా భూపాల్ ల ఎంగేజ్మెంట్ లోనూ కన్నుల విందుగా దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ఓ స్టిల్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఎప్పుడు వేరెవరో దొంగచాటుగా తీసిన స్టిల్ తో సోషల్ మీడియాలోకి ప్రవేశించిన ఈ జంట, తాజాగా మాత్రం చైతూ స్వయంగా తీసిన సెల్ఫీతో హంగామా సృష్టిస్తున్నారు. స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో ఉన్న చైతూ – సమంత జంటకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. నాగార్జునతో ప్రారంభమైన అక్కినేని వారింట ‘ప్రేమ – పెళ్లి’ అనుబంధాన్ని చైతూ – సమంతలు మరో స్థాయికి తీసుకెళ్తున్నట్లుగా కనపడుతోంది.