naga-chaitanya-samantha-reception-fixedటాలీవుడ్ హాట్ పెయిర్ సమంత – నాగచైతన్యల వివాహం ఎప్పుడు జరుగుతుందో ప్రస్తుతం సమాచారం లేదు. ఇటీవల హల్చల్ చేసిన వార్తలను బట్టి వచ్చే ఏడాది ఆగష్టులో ముహూర్తం ఉండవచ్చని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి ఇదే ప్రశ్నను పెళ్ళికూతురు సమంతను అడిగితే ఏమని సమాధానం చెప్పిందో తెలుసా..?

పెళ్లి కబురు పక్కనపెట్టి, తమ రిసెప్షన్ సంగతులను చెప్పుకొచ్చింది. తాము పెళ్లి ఎక్కడ చేసుకున్నా, రిసెప్షన్ మాత్రం ఇదే రెస్టారెంట్ లో చేసుకుంటామని సమంత ధృవీకరించింది. ఇంతకీ ఆ రెస్టారెంట్ ఏంటిది అనుకుంటున్నారా… నితిన్ – నీరజ కోనలు కలిసి సమంత చేతుల మీదుగా ప్రారంభించిన ‘టీ గ్రిల్స్’ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ చాలా బాగుందని తమ రిసెప్షన్ ఇక్కడే జరుగుతుందని, శుక్రవారం నాడు జరిగిన ప్రారంభోత్సవం సందర్భంగా సమంత చెప్పుకొచ్చింది.

ఈ రిసెప్షన్ వెన్యూ ఫిక్స్ అయినా, డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. ఆ తేదీని ఎప్పుడు వెల్లడిస్తుందో గానీ, ఇటీవల పబ్లిక్ ప్లేస్ లలో ఈ ఇద్దరూ హల్చల్ చేయడం తగ్గించారు. అంతా అధికారికం అయిపోవడంతో పెద్దగా కిక్ ఉండదని భావించారో ఏమో గానీ, చైతూ – సమంతల సోషల్ మీడియా హంగామాకు కొద్ది రోజులుగా బ్రేక్ పడింది. అక్కినేని వారి ఇంట పెద్ద కోడలు అయినప్పటికీ, లేటుగా ఆ ఇంట అడుగుపెట్టనుంది సమంత.