naga-chaitanya-samanthaసెలబ్రిటీల మధ్య ప్రేమ అంటే అది సామాన్యులకు చేరే అవకాశం లేదు. ఏదో టీవీలో వచ్చే న్యూస్, గాసిప్ ల ద్వారానో వారి వారి విషయాలు దరి చేరుతుంటాయి. అయితే ఈ విషయంలో నాగచైతన్య – సమంతల రూటే సపరేటు. సహజంగా గుట్టుగా దాచుకునే సినీ సెలబ్రిటీల ప్రేమ విషయాలను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం విశేషం. అంతేకాదు, తామిద్దరం ప్రేమను ఎంతగా ఆస్వాదిస్తున్నామో చూడండి అంటూ… ఫోటోను కూడా షేర్ చేసుకుంది.

లేటెస్ట్ గా సమంత చేసిన ట్వీట్లకు పీవీ సింధు, గుత్తా జ్వాలా వంటి క్రీడాకారులు కూడా స్పందించారు. బాడ్మింటన్ కోర్టులో పడిపోయి ఉన్న సమంత, తాను గెలిచినట్లుగా, నాగచైతన్య ఓడిపోయినట్లుగా ఓ ఫోటోను విడుదల చేసింది. ఈ సమయంలో మాకు పీవీ సింధునే స్పూర్తి అంటూ తెలిపింది. సమంత గెలుపుకు గుత్తా జ్వాలా అభినందనలు తెలుపగా, పీవీ సింధు ఓ చిరునవ్వు చిందించింది. ఇలా తమ ప్రేమానుభూతులను సోషల్ మీడియా వేదికగా సమంత పంచుకోవడం అభిమానులకు, నెటిజన్లకు కొత్త అనుభూతులను ఇస్తోంది.