Naga Chaitanya Samantha, Naga Chaitanya Samantha Video, Naga Chaitanya Samantha Viral Video, Naga Chaitanya Samantha Goes Viral Video, సోషల్ మీడియాను సమంత – నాగచైతన్యల సంబంధం ఊపేస్తోంది. ధియేటర్లో ఫోటో, బాల్కనీలో మాట్లాడుకోవడం (నిజమైన వీడియోనో కాదో?) వంటివి ఓ రేంజ్ లో హల్చల్ చేయగా, తాజాగా వీరిద్దరూ నిజంగా మాట్లాడుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘మనం’ సినిమా విడుదలైన సమయంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా నాగచైతన్య – సమంతలు కలిసి యాంకర్ రవి నేతృత్వంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలో సమంతకు నిజమైన ప్రేమ ఫీలింగ్ కలిగేలా ప్రపోజ్ చేయాలని యాంకర్ రవి అడిగిన నేపధ్యంలో స్పందించిన చైతూ… ‘ఫ్రం బాటం ఆఫ్ మై హార్ట్ ఐ లవ్ యు సమంత’ అంటూ చెప్పగా, అది నమ్మేలా లేదంటూ సమంత చెప్పడంతో మరోసారి ప్రపోజ్ చేయాలని యాంకర్ విజ్ఞప్తి చేయగా, చైతూ ‘నేను చెప్పినదంతా నిజమే… నిజంగానే చెప్తున్నాను’ అని చెప్పడం విశేషం. అయితే ఆ తర్వాత మళ్ళీ ‘శ్యామ్ రియల్లీ ఐ లవ్ యు’ అని చెప్పగా, సమంత ‘ఓకే ఓకే’ అంటూ నవ్వేసింది.

ఈ వీడియో ఇప్పటిది కాదు. ఆ సమయంలో ‘మనం’ చిత్ర ప్రమోషన్లో భాగంగా అని అంతా భావించారు. అయితే అది ప్రమోషన్ సినిమాకు సంబంధించింది కాదు, నిజ జీవితానికి సంబంధించింది అంటూ నెటిజన్లు ప్రస్తుతం ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అలాగే… కమెడియన్ ధర్మవరం ఒక సినిమాలో చెప్పినట్లు… నిజం చెప్తే ఎవడు నమ్మాడు… అప్పుడే చైతూ బహిరంగంగా చెప్పేసారు… ప్రేక్షకులే నమ్మలేదు… అంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.