అక్కినేని సినిమా పై ఉప్పెనంత ఆశలుయువ సామ్రాట్ నాగ చైతన్య లవ్ స్టోరీ ఏప్రిల్ 16 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రం సూపర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తోంది. ఆంధ్రాలో బిజినెస్ ఏకంగా 15 కోట్ల నిష్పత్తిలో జరుగుతోంది. నెల్లూరు హక్కులను 1.2 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది సెన్సషనల్ రేట్ అనే చెప్పుకోవచ్చు. ఫిదా ఫలితాన్ని బట్టి ఈ చిత్రం ఉప్పెన తరహాలో బాగా ఆడుతుందని ట్రేడ్ భావిస్తోంది.

ఆ రేంజ్ లో ఉంటే 60 కోట్ల షేర్ ఖాయమని వారు బలంగా నమ్మి ఎక్కువ రేట్లు పెడుతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఫిదా విజయం సాధించిన తరువాత ఆయన చాలా హై లో ఉన్నారు… అలాగే నాగ చైతన్య కూడా మాజిలితో హిట్ ఇచ్చి మంచి ఊపు మీద ఉన్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్.

ఎఆర్ రెహమాన్ దగ్గర పని చేసిన పవన్ సిహెచ్ ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన సారంగ దరియా పాట సినిమా ప్రమోషన్లకు మంచి ఊపునిచ్చి సినిమా మీద హైప్ పెంచింది. గత ఏడాది సమ్మర్ కోసం విడుదల చేయాల్సిన లవ్ స్టోరీ కరోనా సంక్షోభం కారణంగా ఏడాది ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఆహా వీడియో ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను పొందింది. నైజాం లోని సీనియర్ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లలో ఒకటైన ఆసియా సినిమాస్, నాగ చైతన్య లవ్ స్టోరీతో నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమా పూర్తి చేసి నాగచైతన్య ఇప్పటికే మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ తో చేస్తున్న తదుపరి చిత్రం… థాంక్ యూ షూటింగ్ మొదలుపెట్టేశాడు.