ఇదేమి చిత్రం…. నాగచైతన్య కొత్త ప్రాజెక్టును ప్రకటించిన జెమినీ టీవీ

Naga Chaitanya - Rashmika Mandanna -Adhe Nuvvu - Adhe Nenu-Gemini TVసహజంగా ఒక సినిమా కాంబినేషన్ ను నిర్మాతలు ప్రకటిస్తారు. ఆ తరువాత కొన్ని రోజుల షూటింగ్ అనంతరం ప్రసార హక్కులు అమ్ముడు అయిపోతాయి… చిన్న సినిమాలకు విడుదల తరువాత కూడా అమ్ముడు పోతాయి. బాగా క్రేజీ సినిమాలు అయితే షూటింగ్ మొదలు కాకముందే ప్రసార హక్కులు అమ్ముడు అయిపోతాయి. కానీ ఒక సినిమాను అధికారికంగా ఒక టీవీ ఛానల్ మేము ప్రసార హక్కులు కొన్నాం.. ఈ చిత్రం జరగబోతుంది అని ప్రకటించడం ఎప్పుడైనా చూశారా? సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది.

జెమినీ టీవీ తన ట్విట్టర్ హేండిల్ లో కాసేపటి క్రితం నాగచైతన్య, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వస్తున్న అదే నువ్వు అదే నేను అనే చిత్రం సాటిలైట్ రైట్స్ కొన్నాం అని ప్రకటించింది. దర్శకుడి పేరు కూడా లేదు. అయితే నాగచైతన్య, రష్మిక మందన్నా కాంబినేషన్ లో కొత్త సినిమా ఏదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఈ మధ్యనే నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల సినిమా ఒకటి ప్రకటించారు. కొంపతీసి జెమినీ టీవీ హీరోయిన్ విషయంలో పొరపాటు పడిందా అనే అనుమానాలు ఉన్నాయి.

లేకపోతే ఏదైనా కొత్త చిత్రం అధికారిక ప్రకటన జెమినీ టీవీనే చేసిందా అనేది తెలియాల్సి ఉంది. రెండోది నిజమైతే గనుక టాలీవుడ్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టే. నాగచైతన్య ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే కమ్ముల సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలు పెట్టాడు. మరోవైపు రష్మిక సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఆమె ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా ఒక స్టార్ హీరో తో పని చేస్తుంది.

Follow @mirchi9 for more User Comments
Major-Accident-on-Shankar-Indian-2-SetsDon't MissWatch: Major Accident on Shankar’s Indian 2 SetsReports are emerging that a crane carrying some lighting equipment came down crashing on the...Sayyeshaa - AryaDon't MissWife Awed by Hubby's Beast-Mode TransformationSayyeshaa, Akhil's debut heroine posted a pic of her hubby, Tamil actor Arya who worked...Jr NTR - Trivikram- SrinivasDon't MissIt's Official: NTR30 Locked And Loaded, Dream Line For Young TigerAnd here comes the big news that fans of Young Tiger NTR have been waiting...ys jagan - governor Biswabhusan HarichandanDon't MissAmaravati Ball Keep Coming to BJP's CourtBJP-led Central Government tried to brush off its responsibility for the Capital of Andhra Pradesh...V-Kicks-Off-TFI-Summer-Mania-In-Style,-Highlights-A--Common-Theme!Don't MissV Kicks Off TFI Summer Mania In Style, Highlights A Common Theme!The teaser of V was revealed a day ago, and it has officially kick-started the...
Mirchi9