naga-chaitanya-on-samantha-latestత్వరలో అక్కినేని వారింటిలో పెద్ద కోడలుగా అడుగు పెట్టబోతున్న సమంత గురించి విశేషాలను పంచుకోవడంలో అక్కినేని కుటుంబం ఒకడుగు ముందుకు వేసినట్లుగా కనపడుతోంది. ఇటీవల నాగార్జున ఏకంగా సమంతకు – తనకు మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పంచుకుని అవాక్కు చేయగా, తాజాగా సమంతకు కాబోయే శ్రీవారు నాగచైతన్య కూడా తన ప్రియురాలిపై ఓపెన్ అయ్యారు.

మే 26వ తేదీన విడుదల కాబోతున్న “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన చైతూ ‘కుందనపు బొమ్మ’ గురించి చెప్పుకొచ్చాడు. “తనకు వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదని, కాని సమంత మాత్రం తనను కలిసిన ప్రతిసారీ విపరీతంగా ఫోటోలు తీసేసి, దానినిసోషల్ మీడియాలో పెట్టేస్తుందని, సమంతలో ఈ విషయం తనకు నచ్చదని తెలిపాడు చైతూ.

అలా సమంత పోస్ట్ చేసిన వాటి గురించి స్నేహితులు నన్ను ఆట పట్టిస్తుంటారు, అలాగే మిగతా వారంతా నన్ను అడుగుతుంటారు, వారందరికీ నవ్వే సమాధానంగా మౌనం వహిస్తానని చెప్పిన చైతూ… పెళ్లికి ముందు సమంత ఇలా మధురానుభూతులను నిక్షిప్తం చేసుకుంటోందని సరిపెట్టుకుని నవ్వుకుంటానని చెప్పాడు. ఈ సెలబ్రేషన్స్, మూవ్ మెంట్స్, ఎమోషన్స్, అటాచ్ మెంట్ మళ్లీ మళ్లీ వచ్చేవి కాదని, లైఫ్ టైమ్ ఎక్స్ పీరియెన్సెస్ ప్రేమలోకంలో ఉన్న నాగచైతన్య బాగానే ఫీల్ అవుతూ చెప్పాడండి..!