పూల చొక్కాతో సరికొత్తగా చైతూ!మాస్ సినిమాలు చేసినా సాఫ్ట్ గా కనిపించే నాగచైతన్య తొలిసారిగా ఎనర్జిటిక్ గా కనపడుతున్నాడు. “బంగార్రాజు” సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ లో అక్కినేని అభిమానులతో తో పాటు సినీ ప్రేమికులను కూడా పడేసాడు చైతూ.

సమంతతో బ్రేకప్ చెప్పిన తర్వాత విడుదల కానున్న చైతూ సినిమా కావడంతో… ఇందులో ఎలా కనిపించబోతున్నాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఫస్ట్ లుక్ లోనే ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ పూలరంగడులా తళతళలాడిపోతున్నాడు.

చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ రిలీజ్ అయిన ఈ పోస్టర్ లో మంగళవారం నాడు ఉదయం 10.23 గంటలకు “బంగార్రాజు” టీజర్ రిలీజ్ కాబోతోందని మరోసారి స్పష్టం చేసారు. నటసామ్రాట్ కు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో కనపడుతోన్న యువసామ్రాట్ లుక్ మీ కోసం..!