Bangarraju Teaserసంక్రాంతికి ఏర్పడిన పోటీ ప్రభావంతో రేసు నుండి ఒకడుగు వెనక్కి వేసినా, జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న “బంగార్రాజు” సినిమా ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ అక్కినేని అభిమానులకు నచ్చడంతో, టీజర్ లో ఇంకేం చూపిస్తారో అన్న ఆసక్తి నెలకొంది.

కానీ ఇది టీజర్ కాదు, పోస్టర్ కు కాస్త కొనసాగింపు మాత్రమేనని 58 సెకన్ల వీడియో స్పష్టం చేసింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో ‘బంగార్రాజు’ క్యారెక్టర్ మేనరిజాన్ని చైతూ ద్వారా ఈ టీజర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో చూపించారు. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ చైతూ లుక్ తప్ప ఈ టీజర్ లో ఏం లేకపోవడంతో నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

కేవలం చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కోసమే ఈ వీడియోను కట్ చేయించారు. దీంతో సినిమా కధకు సంబంధించి అసలు టీజర్ ను చిత్ర యూనిట్ మళ్ళీ విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే “బంగార్రాజు” మూవీకి రెండు టీజర్లు అన్న మాట!