Naga Chaitanya Akkineniకింగ్ నాగార్జున బ్రహ్మాస్త్రం సినిమాతో బాలీవుడ్ లోకి పునరాగమనం చెయ్యబోతున్నారు. మరోవైపు… యువ సామ్రాట్ నాగ చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. అమీర్ ఖాన్ యొక్క లాల్ సింగ్ చద్దాలో అతను ఒక సహాయక పాత్రలో కనిపించనున్నారు. చైతన్య మే నెలలో ఈ చిత్రానికి తేదీలు కేటాయించాడు.

అతనికి సంబంధించిన అన్ని భాగాలను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేస్తాడు. అమీర్ ఖాన్ చిత్రం అంటే పబ్లిక్ లో చాలా ట్రాక్షన్ పొందుతుంది కాబట్టి ఇది చైతన్యకు అద్భుతమైన అవకాశం. మొదట్లో ఈ పాత్రకు విజయ్ సేతుపతి అనుకున్నారు. అయితే ఆయన అందుబాటులో లేనందున చైతన్యను ఈ పాత్ర వరించింది.

సహజంగా ఒక పాత్ర కోసం విజయ్ సేతుపతిని అనుకుంటే.. అది ఖచ్చితంగా ఎంతో కొంత విషయం ఉన్న పాత్రే అయ్యి ఉంటుంది. ఏ రకంగా చూసినా ఇది నాగచైతన్యు కు మంచి అవకాశమే. లాల్ సింగ్ చద్దా హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ యొక్క హిందీ రీమేక్. భారతీయ సున్నితత్వాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేశారు.

అతుల్ కులకర్ణి రచన సారథ్యంలోని ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయిక. డిసెంబర్ 24 2021న క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరోనా కారణంగా ఈ సినిమా ఏకంగా ఏడాది పాటు వాయిదా పడింది.