బంగార్రాజు సినిమా మొదటి పబ్లిక్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతున్న సమయంలో… నాగచైతన్య – దక్షనగర్ ల నడుమ జరిగిన చిలిపి నవ్వులు, సైగలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. సమంతకు బ్రేకప్ చెప్పిన తర్వాత చైతూ వచ్చిన మొదటి పబ్లిక్ అప్పీరియన్స్ కావడం… ఆ ఈవెంట్ లో అలా హీరోయిన్ తో చిరుదరహాసాలు ప్రదర్శించడం ఓ విధంగా హాట్ టాపిక్ అయ్యింది.
కట్ చేస్తే… రాజమండ్రిలో ‘బంగార్రాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్ వైసీపీ నేతల నడుమ కరోనా నిబంధనలను అమలు చేస్తూ అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేదికపై నాగార్జున మాట్లాడుతున్న సమయంలో… నాగచైతన్య – హీరోయిన్ కృతి శెట్టిలు మళ్ళీ ఒకరినొకరు చూసుకోవడం, చిలిపి నవ్వులు నవ్వుకోవడం అంతా… నాగ్ బ్యాక్ గ్రౌండ్ లో జరిగిపోయింది.
రెండు ‘బంగార్రాజు’ ఈవెంట్స్ లో ఇద్దరు వేర్వేరు హీరోయిన్లతో చైతూ పండించిన స్టేజ్ కెమిస్ట్రీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక హీరోయిన్ తో అయితే ఏదో కాకతాళీయంగా అలా జరిగింది అనుకోవచ్చు, ఇద్దరు భామలతో ఒకే విధంగా ఇలా ఎలా? అంటూ నెటిజన్లు చైతూను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు కోకొల్లలు.
అయితే ఈ కెమిస్ట్రీ కేవలం స్టేజ్ వరకేనా, లేక తెరవెనుక కధలు ఏమైనా నడుస్తున్నాయా? అన్న రీతిలో సెలబ్రిటీల గురించి చర్చించుకోవడం సహజం. ఒకప్పుడు సైలెంట్ గా ఉండే చైతూ ఇప్పుడు తండ్రి మాదిరి ‘నవమన్మధుడు’లా మారిపోతున్నారా? మొత్తానికి సమంతతో బ్రేకప్ నాగచైతన్యలో పెను మార్పులకు కారణమైనట్లుంది.
Managing Two Heroines, This Manager Becomes A Sucker!
Jagan Can’t Complete Full Term?