naga chaitanya about samantha ruth prabhu cookingప్రస్తుత తరంలో చూడముచ్చటైన సెలబ్రిటీ జంటగా ఒక్కటి కాబోతున్న చైతూ – శ్యామ్ ల ప్రేమ, పెళ్లి తదితర సంగతుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇప్పటికే అధికారికం అయిన ఈ జంట వివాహం అక్టోబర్ మొదటి లేక రెండవ వారంలో ఉండవచ్చని నాగచైతన్య స్పష్టం చేసారు. తమ వివాహం హిందూ సంప్రదాయ ప్రకారం, అలాగే క్రిష్టియన్ మత ప్రకారం రెండు సార్లు జరుగుతుందని, తమ హనీమూన్ ను ‘ఏ మాయచేసావే’ షూటింగ్ జరిపిన లండన్ లో జరుపుకోబోతున్నామని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చైతూ తెలిపారు.

సరదాగా వంట చేసే తనకు తెలియకుండా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేసిందని, తానేమో అందుకు విరుద్ధంగా ఉంటానని, ఇలా అల్లరి పనులు చేసేస్తుంటుందని సమంత గురించి చెప్పుకొచ్చారు. ఇక వంట విషయంలో సమంత జీరో అని, అస్సలు తెలియదని, లైఫ్ ను చాలా జాలీగా, హ్యాపీగా గడపడం తప్ప, వర్రీ, స్ట్రెస్, కుకింగ్ లాంటివి సమంతకు తెలియని విషయాలుగా తన పార్టనర్ గురించి నవ్వుతూ చెప్పారు. మళ్ళీ తామిద్దరం కలిసి ఒక ప్రేమకధలో నటించాలని ఉందని, తప్పకుండా చేస్తామని అభిమానులకు తీపికబురు అందించారు.

‘ఏ మాయచేసావే’ సినిమాలో సమంత తన కంటే రెండేళ్ళు పెద్ది కావచ్చు గానీ, రియల్ లైఫ్ లో మాత్రం తానే పెద్ద వాడినని చిరునవ్వులు చిందిస్తూ తెలిపారు. తానంటే బ్యాక్ గ్రౌండ్ ఉండి ఈ స్థాయిలో ఉన్నాను గానీ, సమంత చాలా కష్టపడి పైకి వచ్చిందని, అందుకే తనంటే చాలా గౌరవభావం ఉంటుందని, అందులోనూ ఇతరులకు సేవ చేయడంలో సమంత ఎప్పుడూ ముందుంటుందని, చిన్న పిల్లల విషయంలో తను చేస్తున్న దానికి చాలా సంతోషంగా ఉందని, వీలైనంత ఎక్కువ సహాయం చేయమని ప్రోత్సహిస్తానని శ్యామ్ ను పూర్తిగా అర్ధం చేసుకున్న వ్యక్తిగా తన భావాలు పంచుకున్నారు ఈ అక్కినేని వారసుడు.