naga babu maaa President electionsమా ఎన్నికల ఫలితాలొచ్చేశాయి. విష్ణు గెలుపొందాడు ప్రకాష్ రాజ్ కు భంగపాటు తప్పలేదు. అయితే ప్రకాష్ రాజ్ కంటే కూడా ఇది చిరంజీవి ఓటమి అని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. అయితే అందుకు కారణం మెగా బ్రదర్ నాగబాబు.

ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గా ఉండాలనుకుంటున్న చిరంజీవి సహజంగా ఇటువంటి ఎన్నికలలో ప్రత్యక్ష్యంగా ఎవరి వైపూ ఉండకూడదు. అయితే చిరంజీవి ప్రకాష్ రాజ్ వైపు ఉన్నారని నాగబాబు పదే పదే మీడియా ముందుకు వచ్చారు.

ప్రకాష్ రాజే లేదు ఆయన ఎవరి పక్షాన్నా ఉండరు అని అన్నా.. నాగబాబు మాత్రం ఇల్లు పీకి పందిరి వేశారు. ప్రకాష్ రాజ్ ఓటమి తరువాత చిరంజీవి పరువు పోయాకా పాడు ప్రపంచం పాడు లోకమంటూ మా రాజీనామా చేసి తప్పుకున్నారు నాగబాబు.

అయితే ఇలా చెయ్యడం నాగబాబుకు ఇది మొదటిసారి కాదు. ప్రజారాజ్యం సమయంలో కులసంఘాలతో మీటింగులు పెట్టి మీడియాలో దొరికిపోయి అన్నయ్యకు ఇబ్బంది తెచ్చారు. ఆరంజ్ సినిమాలో భారీ నష్టాలు.. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అంటూ చరణ్ కు కెరీర్ స్టార్టింగ్ లో బ్యాడ్ నేమ్ తెచ్చారు.

మొన్నటి జనసేన విషయంలో కూడా అంతే. యూట్యూబ్ వీడియోలతో హడావిడి చేసి చివరికి నరసాపురం పార్లమెంట్ కు పోటీ చేస్తే మూడవ ప్లేస్ కే పరిమితం. అప్పుడు కూడా తన తప్పు ఉందా అనేది చూసుకోకుండా… రాజకీయాలకు సెలవు అని ప్రకటించేశారు.

ఇప్పుడు మా ఎన్నికల విషయంలో కూడా ఇంతే… హడావిడి చేసి అన్నయ్యకు బ్యాడ్ నేమ్ తెచ్చి.. రాజీనామా అనేశారు. మళ్ళీ ఇంకో వివాదం వచ్చినప్పుడు మళ్ళీ లూస్ టాక్… కుటుంబపరువు పోగొట్టడం… ఆ తరువాత తప్పుకోవడం.