naga-babu-allu-arjun-naa-peru-surya-Audio-Launch-Jana-Senaపాటలు విడుదల చెయ్యాల్సిన వేదిక పై, మాటల తూటాలు విడుదలయ్యాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆడియో వేదిక రాజకీయ సభలా మారింది. నా పేరు సూర్య నిర్మాతల్లో ఒకరైన నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద వస్తున్న ఆరోపణలు కుట్రలు పనికిమాలిన రాజకీయ చర్య లుగా అభివర్ణించారు, మెగా ఫామిలీకి అభిమానులందరూ కావాలని, పవన్కి అండగా నిలవాలన్నారు, సినిమా పాటల విషయం పూర్తిగా మర్చిపోయారు, ఒక్క హీరోగురించి మాత్రమే మాట్లాడిన నాగబాబు, తాను ఈ సినిమా నిర్మాత అని కూడా మర్చిపోయి రాజకీయ తూటాలు పేల్చారు, భోజనాలకు పిలిచి టిఫిన్ పెట్టినట్లు ఆడియో ఫంక్షన్ కి పిలిచి జనసేన రాజకీయ ప్రచారం చేసారు.

ఇక ఈ సినిమా హీరో అల్లు అర్జున్ కూడా అన్యమనస్కంగా స్టేజీపైనా సినిమా గురించి, దర్శకుడి గురించి మాట్లాడి, మధ్యలోనే ..పవన్ అభిమానుల మెప్పు పొందటంకోసం, పవన్ ప్రచారం ప్రారంభించారు, పవన్ విషయం లో మీడియా ప్రవర్తన తనకు కోపం తెప్పించిందని, సరైనోడు తరహాలో తలా అడ్డంగా తిప్పుతూ ఇది మంచిప్రవర్తన కాదన్నారు. ఆడియో సభలో మెగా భజన అయిపోయిన వెంటనే ఒక డైలాగ్ చెప్పి నిష్క్రమించారు. పాటలరచయిత, సంగీతదర్శకుడి గురించి ఒకే ఒక్క మాట తప్ప ఇంకేమి మాట్లాడలేదు, ఫంక్షన్ మొత్తం హడావిడిగా సాగింది. తన తమ్ముడు అంటూ రాంచరణ్ రంగస్థలం విజయం సాధించినందుకు లేటుగా అభినందనలు తెలియచేసాడు బన్నీ.

ఆడియోఫంక్షన్లో మిలిటరీకుటుంబాలకు మిర్మాతలు సాయం చేసారు, మిలిటరీ మాధవరం లో ఈ ఆడియో ఫంక్షన్ జరగడం మా అదృష్టం, సినిమా లో అల్లు అర్జున్ లోని విభిన్న భావాలూ చూడొచ్చు అని దర్శకుడు వక్కంతం వంశి చెప్పాడు మే నాలుగవ తారీఖున విడుదలవుతున్న ఈ సినిమా ని అందరు ఆదరించాలని కోరుకున్నారు.