Nag-Ashwin---KTR-Telanganaఒక స్నేహితుడు మరణంపై ఒక టాలీవుడ్ దర్శకుడు తన ఆవేదనను ట్విట్టర్ లో పంచుకున్నాడు. చనిపోయిన తన స్నేహితుడు మంచి క్యామేరా మ్యాన్ అని. కానీ అర్ధాంతరంగా తాను మరణించాడు అని ఆయన చెబుతూ, ఈ మరణానికి కారణం “హైదారాబాద్- గాంధీ హాస్పిటల్” అంటూ తన ఆవేదనను ట్విట్టర్ లో పంచుకున్నాడు.

అయితే అసలు ఏం జరిగింది అంటే టాలీవుడ్ లో తన టాలెంట్ తో మహానటి లాంటి సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ స్నేహితుడు ఒకరికి ఆదివారం రోడ్ ఆక్సిడెంట్ అయ్యింది. అయితే హూటా హుటిన హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కి తీసుకు రాగా కనీసం గాయాలపాలైన తన స్నేహితుణ్ణి లోపలకు తీసుకు వెళ్ళడానికి కనీసం అటెండర్స్ కూడా లేరు. అయితే ఆయన తల్లితండ్రులే స్ట్రెచర్ తీసుకుని అతన్ని లోపలికి తీసుకు వెళ్లారు. అయితే ఆదివారం కావడంతో డ్యూటీలో డాక్టర్స్ ఎవ్వరూ లేకపోవడంతో సరైన సమయానికి వైద్యం అందక దాదాపుగా మూడు గంటల పాటు ప్రాణాలతో పోరాడి తన స్నేహితుడు మరణించాడు అని…ఎవరిని అడగాలో, ఎవరిని నిందించాలో అర్ధం కాని పరిస్థితి అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందులోని రాష్ట్ర రాజధానిలో వైధ్యం అందక ఒక వ్యక్తి మరణించడం నిజంగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే అంటూ తన బాధను వెళ్ళగక్కాడు. ఇదే వేరే హాస్పిటల్ కి తీసుకువెళ్ళి ఉంటే మూడు గంటల్లో అతను బ్రతికి బయటపడే వాడు అండీ అంటూ ప్రభుత్వాన్ని నాగ్ అశ్విన్ ప్రశ్నించాడు.

అయితే నాగ్ అశ్విన్ ట్వీట్ కి రెస్పాండ్ అవుతున్న వారంతా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. అయ్యా కేటీఆర్ గారు ఇదేనా మీరు చేస్తున్న ప్రజాపలన అంటూ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు ఉండేలా, వైదులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా, ఇలాంటి ఘటనా చాలా బాధాకరం అనే చెప్పాలి, ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వాటిపై కాస్త సీరియస్ యాక్షన్ తీసుకోవాలి లేదంటే ఇలాంటి ఘటనలు ఇలానే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నది ఒప్పుకోక తప్పని నిజం. మరి చూద్దాం ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో.