Naemsake ministry to Kishan Reddyఎన్డీయే సర్కారులో మొత్తం 57 మందికి మంత్రులుగా అవకాశమిచ్చారు. వీరిలో 36 మంది గతంలో చేసినవారే కాగా 21 మంది కొత్తవారు. మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్‌ హోదా ఇచ్చారు. 9 మందికి స్వతంత్ర ప్రతిపత్తితో మంత్రులను చేశారు. మోడీ కేబినెట్ లో చోటు సంపాదించుకున్న మంత్రులకు ఫోర్ట్ ఫోలియోలు కేటాయింపు చేశారు. తెలంగాణ నుంచి గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ కిషన్‌రెడ్డిని హోం శాఖ సహాయ మంత్రిగా కేంద్రం కేటాయించింది.

అయితే ఇది అపప్రధాన్య శాఖ అనే చెప్పుకోవాలి. గత కేబినెట్ తో పోలిస్తే కొన్ని కీలక మార్పులు చేశారు. కేంద్ర హోంశాఖ అమిత్ షాకు కేంద్రం కట్టబెట్టింది. రాజ్‌నాథ్‌ సింగ్ కు రక్షణ శాఖ, నితిన్‌ గడ్కరీ కు ఉపరితల రవాణా శాఖ, నిర్మలా సీతారామన్ ‌కు ఆర్థిక శాఖ వంటి కీలకమైన శాఖలు అప్పగించారు. గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ ఈ సారి అనారోగ్యకరణల రిత్యా తప్పుకున్నారు. గత కేబినెట్ మెరుగైన పనితీరు కనబరిచిన సుష్మా స్వరాజ్ ఈ సారి పోటీ చెయ్యలేదు. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోలేదు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌, ఆరు ఈశాన్యరాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎలాంటి ప్రాతినిధ్యం లభించలేదు. బీజేపీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాలలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం లభించకపోవడం ఇదే మొదటి సారి. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్డీయే ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ తరపున వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, విద్యా సాగర్ రావు అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.