Nadendla Manohar to join YSRCPజనసేన పార్టీలో నెంబర్ 2, గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్. ఆయన పార్టీలో చేరిన నాటి నుండి పవన్ కళ్యాణ్ తో చేతిలో చెయ్యవేసి ఆయన కూడానే తిరుగుతున్నారు. అన్ని ముఖ్య కార్యక్రమాలు, మీటింగులు, ప్రెస్ మీట్లలో ఆయన స్థానం పవన్ కళ్యాణ్ పక్కనే. అటువంటి మనోహర్ విషయంలో జనసైనికులకు ఒక బాంబు పేలింది. పైగా అది వేసింది ఎవరో కాదు స్వయంగా మనోహర్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు.

2014 తరువాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగిన నాదెండ్ల మనోహర్ 2018 చివరిలో తన రాజకీయ భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మొదట వచ్చిన ఆలోచన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం. నాదెండ్ల మనోహర్, నాదెండ్ల భాస్కర్ రావు జగన్ ను కూడా సంప్రదించారట. అయితే నాదెండ్ల మనోహర్ ఆశించిన తెనాలి సీటు అప్పటికే అన్నాబత్తుని శివకుమార్ కు ఇస్తా అని మాట ఇచ్చా అని, పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తా అని జగన్ అన్నారట.

దీనితోనే మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ కు వెళ్లకుండా జనసేన వైపు వెళ్లారని నాదెండ్ల భాస్కర్ రావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది ఇలా ఉండగా ఈ సారి జనసేన నుండి పోటీ చేసిన మనోహర్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. కేవలం ముప్పయి వేల ఓట్లు వచ్చాయి. ఇదే మనోహర్ 2014 ఎన్నికల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినప్పుడు కూడా మూడవ స్థానంలోనే ఉండటం గమనార్హం.