Nadendla Bhaskara Rao legal notice to NTR Biopicసహజంగా జరిగిన కధలను ఆధారంగా చేసుకుని తీసే సినిమాలు..కొన్ని జీవిత చరిత్రల ఆధారంగా తీసే బయోపిక్స్ అన్నీ అనేక సమస్యలతో ముడిపడి ఉంటాయి..అయితే అన్నీ నిజాలే చూపించలేరు…ఆలా అబద్దాలను తీసి కొందరిని ఇబ్బంది పెట్టే విధంగా తెరకెక్కించలేరు…కానీ బయోపిక్స్ పేరు చెబితే చాల మంది..ముఖ్యంగా నిజ జీవితంగా కధలో భాగం అయిన వాళ్ళు మాత్రం ఓ భయపడిపోతున్నారు..

“వంగవీటి” సినిమా విషయమే తీసుకుంటే రంగాని ఈ సినిమాలో తప్పుగా చిత్రీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ రచ్చ రచ్చ చేశారు ఆ కుటుంభం సభ్యులు..

ఇక “రక్త చరిత్ర” సినిమా సమయంలో కూడా ఆ కధకు సంభందించిన ఇరు వర్గాలు వర్మకి అలాంటి వార్నింగ్స్ నే పంపాయి అని మనకు తెలిసిన విషయమే..

అంతెందుకు మొన్నటికి మొన్న “మహానటి” సినిమాలో జెమినీ గణేశన్ పాత్రను తప్పుగా చూపించారు అని ఆ కుటుంభం కన్నెర్ర చేసింది..

ఇప్పుడు మరో బయోపిక్ అయిన “ఎన్ఠీఆర్”లో ‘నా పాత్రను తప్పుగా చూపిస్తే మీ అంతు చూస్తా’ అంటున్నారు నాదెండ్ల్ వారు..అంతేనా ఏకంగా బాలయ్యకి…క్రిష్ కి లీగల్ నోటీసులు కూడా పంపారు..

ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటి అంటే..”మా పాత్రలు తప్పుగా చూపిస్తే” అనే కోణం ఎందుకు వస్తుంది? అంటే నిజమైన ప్రయాణంలో ఆయనపాత్రలు నిజంగానే తప్పులు చేశాయా? ఒకవేళ చెయ్యకపోతే అంత భయం ఎందుకు..అయితే గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు…సినిమాల పేరు చెప్పి ఈ రచ్చ ఏంటి? సినిమాని సినిమా లాగా చూడాలి కదా….