Tej-I-Love-You-Continues-To-Impressజూలై 6వ తేదీన విడుదల కాబోతున్న కరుణాకరన్ దర్శకత్వం వహిస్తోన్న “తేజ్ ఐ లవ్ యూ” సినిమా నుండి ‘వెన్నల్లా వచ్చి’ వీడియో ప్రోమోను రిలీజ్ చేసారు. బుధవారం నాడు ఈ వీడియో ప్రోమోపై హీరో సాయిధరమ్ తేజ్ – హీరోయిన్ అనుపమల మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకర్షించగా, తాజాగా రిలీజ్ చేసిన వీడియో మాత్రం సాయి చేసిన వ్యాఖ్యలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

అనుపమ తనను చేసిన టార్చర్ కు సాక్ష్యం ఇదంటూ విడుదల చేసిన ఈ వీడియో ప్రోమోలో… ఫస్ట్ షాట్ నుండి అనుపమ పెట్టిన టార్చర్ ఏమిటో హైలైట్ చేసారు. అలాగే సాయి చేత కూరగాయలను మోపిస్తూ తీసిన షాట్స్ వీక్షకులను అలరిస్తున్నాయి. చిత్రీకరణ పరంగా కరుణాకరన్ మార్క్ ఎక్కడా మిస్ అవ్వకుండా కనపడుతోన్న ఈ పాటలో అనుపమనే హైలైట్ గా నిలుస్తోంది.