Naa-Peru-Surya-Thank-you-Meet---Pawan-Kalyan-Allu-Arjun“నా పేరు సూర్య” థాంక్స్ మీట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారన్న వార్త ప్రాధాన్యతను దక్కించుకుంది. రెండేళ్ళుగా బన్నీకి, పవన్ ఫ్యాన్స్ కు జరుగుతోన్న యుద్ధం ఈ థాంక్స్ మీట్ తో శుభం కార్డు పడుతుందని అంతా భావించిన నేపధ్యంలో… అందరికీ ట్విస్ట్ ఇచ్చే విధంగా వేదిక పైన వీరిద్దరూ ముభావంగా కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లయ్యింది.

ముఖ్యంగా అల్లు అర్జున్ ను సంభోదించే సమయంలో ‘అల్లు అర్జున్ గారు’ అని ప్రస్తావించడం మరిన్ని ఆలోచనలకు తావిచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే… ఏదో మొక్కుబడి కోసం ఈ వేడుకకు వచ్చి, పవన్ మాట్లాడినట్లుగా కనపడిందే తప్ప, ‘రంగస్థలం’లో రామ్ చరణ్ అండ్ పవన్ కళ్యాణ్ కు మధ్య ఉన్న బాండింగ్ ఇక్కడ మిస్సయినట్లు అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు.

బహుశా నాగబాబు నిర్మాత కావడం వలనో వచ్చారో లేక ‘జనసేన’ భవిష్యత్తు అవసరాల నిమిత్తం విచ్చేసారో గానీ, పవన్ మనస్పూర్తిగా మాట్లాడినట్లు కనిపించలేదు. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే… పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు “నా పేరు సూర్య” సినిమా చూడకపోవడం! తాను యాత్రకు బయలుదేరే లోపు ఈ సినిమాను చూస్తానని పవన్ చెప్పడం, మెగా ఫ్యాన్స్ కు ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ కు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించిందని చెప్పడంలో సందేహం లేదు.