Naa Peru Surya Latest Poster Talkవక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ రూపొందుతోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో బన్నీ న్యూ లుక్ తో కనిపించనుండటం ఆయన అభిమానులలో ఆసక్తిని పెంచుతోంది. ఈ నెల 8వ తేదీన బన్నీ బర్త్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి బన్నీకి సంబంధించిన మరో పోస్టర్ ను వదిలారు.

పవర్ ఫుల్ లుక్ తో ఈ పోస్టర్ లో బన్నీ అదరగొట్టేస్తున్నాడు. ఆయన ఫేస్ పై భారతదేశంలోని వివిధ ప్రాంతాల పేర్లు వచ్చేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఆర్మీ ఆఫీసర్ గా బన్నీ ఇచ్చిన ఈ స్టిల్ ఆయన అభిమానులను మరింతగా ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాపై మరింతగా ఆత్రుతను పెంచేదిగా వుంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, మే 4వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.