వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” ఆడియో ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు యూ ట్యూబ్ లో విడుదల కానుంది. అయితే అంతకంటే ముందుగానే ‘బ్యూటిఫుల్ లవ్’ అనే వీడియో సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్ లపై చిత్రీకరించిన ఈ పాట విజువల్ గా చాలా బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య ఫీల్ గుడ్ రొమాన్స్ ప్రతి ఫ్రేంలోనూ కనపడుతోంది. అల్లు అర్జున్ ఎప్పటిలానే ఫుల్ స్టైలిష్ గా కనపడుతుండగా, అను కూడా కాలా అందంగా కనపడుతోంది. పాట చిత్రీకరించిన లొకేషన్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి.