షాకింగ్ – అగ్ర హీరోలను తలదన్నే రేంజా?

Na-Nuvve-trailer 7 million viewsనందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన “నా నువ్వే” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను బుధవారం నాడు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. లవ్ అండ్ ఏమోషనల్ ఎంటర్టైనర్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, ఇదే సమయంలో పెద్దగా విమర్శించాల్సింది కూడా ఏమీ లేదు.

కానీ కట్ చేస్తే 24 గంటలు గడిచే సమయానికి ఒక్క యూ ట్యూబ్ లోనే ఏకంగా 7 మిలియన్స్ క్లిక్స్ ను దాటిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇది ‘నాన్ బాహుబలి’ రికార్డు కూడా! ఇటీవల కాలంలో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల ధియేటిరికల్ ట్రైలర్స్ విడుదలయ్యాయి గానీ, ఏది కూడా ఈ స్థాయి రికార్డు క్లిక్స్ ను సొంతం చేసుకోలేదు.

అంతకుముందు విడుదలైన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ కూడా 6 మిలియన్స్ టచ్ చేయలేకపోయింది. కానీ “నా నువ్వే” మాత్రం ఏకంగా 7 మిలియన్ క్లిక్స్ ను అందుకుంది. ఇది ఒక రకంగా షాకింగ్ లాంటి న్యూసే. విశేషం ఏమిటంటే 24 గంటల్లో 7 మిలియన్స్ క్లిక్స్ అందుకున్న్ ట్రైలర్, తదుపరి 6 గంటల్లో ఆ సంఖ్యను కేవలం 7.2 మిలియన్స్ కు మాత్రమే పెంచుకోగలిగింది.

నిజానికి “నా నువ్వే” ట్రైలర్ కు వీక్షకుల నుండి అంత అద్భుతమైన స్పందనా రాలేదు, నందమూరి కళ్యాణ్ రామ్ కు అంత మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, అలాగే ఈ సినిమా ఏ పెద్ద ప్రొడక్షన్ నుండి కూడా రాలేదు. ఉన్న ప్లస్ పాయింట్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నానే ఈ ప్రాజెక్ట్ లో క్రేజీ గర్ల్. అలాగే ఇదే రోజు విడుదలైన ‘మిషన్ ఇంపాజిబుల్’ ట్రైలర్ కూడా కేవలం 4.5 మిలియన్ క్లిక్స్ కే పరిమితమైంది.

Follow @mirchi9 for more User Comments

We Are Hiring: Telugu Content Writer; Contact Us at [email protected]

Taxiwala Gets -The Worse Possible Date 16th NovemberDon't MissTaxiwaala Gets The Worse Possible DateAfter months of waiting a date finally has been set for the release of Taxiwala...Rajamouli - Shobu -YarlagaddaDon't MissHeavy Lobbying to Step out of Rajamouli's #RRR?A hundred crores to make a film is in itself a big budget for a...RGV-Prayer-in-Tirupathi-UnpluggedDon't MissRGV's Prayer in Tirupathi UnpluggedRGV is a true atheist who had openly challenged and made fun of Gods on...KTR-Hello-Guru-Prema-KosameDon't MissKTR Disgusted for Watching That MovieCan the leaders have a normal life at the others? Or their life should only...Aravinda-Sametha-2-MillionDon't MissNTR Hits the 2 Million Mark Again!After a considerably long wait, NTR's Aravinda Sametha hits the 2 Million Mark at the...
Mirchi9